వెగాస్ కాల్పులపై హీరో నికిల్‌ రియాక్ట్‌..

213
- Advertisement -

అమెరికాలోని లాస్ వెగాస్ లో ఉన్న ఓ సంగీత విభావరిలో కాల్పులు చోటుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 20 మందికి పైగా మృతి చెందగా, మరో 100మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై టాలీవుడ్ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

“ఓ మై గాడ్. ఎప్పుడూ సంతోషంగా ఉండే నగరంలో ఇలా జరగడం భావ్యం కాదు. అమాయక ప్రజలపై ఉన్మాదంతో కాల్పులకు తెగబడుతున్న రాక్షసులను అడ్డుకుని, వారిని కఠినంగా శిక్షించాలి. వందలాది రౌండ్ల తూటాలు పేలాయి.

సంగీత విభావరికి వెళ్లినవారు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం భయం గుప్పిట్లో బతుకుతోంది. మన నగరాల్లో ఇలాంటివి జరగకూడదు. చాలా బాధాకరం. లాస్ వెగాస్ లో ఉన్న అందరికోసం ప్రార్థిస్తున్నా” అంటూ ట్వీట్ చేశాడు.

hero nikhil tweet on las vegas shoots

 hero nikhil tweet on las vegas shoots

 

- Advertisement -