హీరో నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా..!

290
- Advertisement -

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఎవరి జీవితంలో అయినా పెళ్లి ఓ మధురానుభూతి. కానీ, కరోనా దెబ్బకు మానవ జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో వివాహం అనేది ప్రాధాన్యత అంశాల క్రమంలో వెనకబడింది. హీరో నిఖిల్ వ్యవహారమే అందుకు నిదర్శనం. నిఖిల్ కొన్నినెలల కిందట భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఫిబ్రవరి 3న నిశ్చితార్థం జరగ్గా, అప్పటికే చైనాలో కరోనా బీభత్సం కొనసాగుతుంది. ఇక, నిఖిల్ ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, అంతకుముందే లాక్ డౌన్ రావడంతో ఆ పెళ్లి మే 14కి వాయిదా పడింది.

అయితే తాజాగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో నిఖిల్ తన పెళ్లిని మరోసారి వాయిదా వేసుకోక తప్పలేదు. ఈ సందర్భంగా కరోనా మహామ్మారి తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్. హ్యాపీడేస్ సినిమాతో పరిచయమైన ఈయన ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు. స్వామి రారా నుంచి ఈయన కెరీర్ మరో టర్న్ తీసుకుంది. వరస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -