హీరో నిఖిల్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా హిట్ అవడం లేదు. ఆయన నటించిన అర్జున్ సురవరం మూవీ చిత్రకరణ పూర్తైన విడుదల మాత్రం కాలేదు. కొన్ని కారణాల వల్ల మూవీ విడుదల ఆగిపోయింది. ఆయన చివరి చిత్రం కిరాక్ పార్టీ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం నిఖిల్ తనకు హిట్ ఇచ్చిన కార్తికేయ మూవీ దర్శకుడు చందు మొండేటితో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.
త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా హీరో నిఖిల్ మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ షోలో తన పర్సనల్ లైఫ్ గురించి వెల్లడించాడు. గత కొంత కాలంగా తాను ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు. ఆమె వైద్యురాలని చాలా మంచి అమ్మాయి అంటూ చెప్పుకోచ్చాడు.
ఆమె నేను షూటింగ్ లో ఉన్నప్పుడు కానీ, నా స్నేహితులతో బయిటకు వెళ్లినప్పుడు కానీ డిస్ట్రబ్ చెయ్యదు. నీకు నచ్చింది చెయ్యి అంటూ తనను ఎంకరేజ్ చేస్తుంటుందని తెలిపాడు. ఇటీవల నిఖిల్ ఆ అమ్మాయి తల్లిదండ్రులను కలిశాడట. పెళ్లి చేసుకుంటామని చెప్పగానే వారూ అంగీకరించారట. నిఖిల్ తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి నచ్చిందట. దాంతో త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.