లాక్‌డౌన్‌పై నిఖిల్ లాజిక్ సెటైర్..!

297
nikhil
- Advertisement -

లాక్ డౌన్ 5.0పై సెటైర్ వేశారు హీరో నిఖిల్. కోవిడ్ 19 కేసులు 10 ఉన్నప్పుడు మనం అందరం లాక్‌డౌన్‌లో ఉన్నాం.. కానీ ఇప్పుడు 2 లక్షల ప్లస్ ఉన్నాయి మనం మాత్రం ఫ్రీగా బయట తిరిగేస్తున్నాం.. లాజిక్ ఏంటంటారు? అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

వాస్తవానికి భారత్‌లో కేసులు తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు కానీ ప్రస్తుతం రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదైతున్న సందర్భంలో సడలింపులు ఇవ్వడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని ఎవరికి వారు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు.

- Advertisement -