బిగ్ బాస్ షోలోకి నవదీప్..?

178
Young Tollywood Hero Into Bigg Boss House
- Advertisement -

 జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్‌తోపాటు పార్టిసిపెంట్స్ కోపతాపాలు, అలకలు, ఆవేశాలతో సాగిపోతున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి మరో తెలుగు యువ నటుడు ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. నటుడిగా మంచి అనుభవం వుండటంతోపాటు పలు సినిమా అవార్డ్స్ ఫంక్షన్స్‌కి హోస్ట్ గా వ్యవహరించిన నవదీప్ ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం.

టాలీవుడ్ నటి దీక్షా పంత్ కూడా గతంలో ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నవదీప్ తాజాగా విడుదలైన నేనేరాజు నేనే మంత్రి సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ‘నేనే రాజు..’ మినహాయిస్తే నవదీప్ ఈ మధ్య సినిమాల్లో కనిపించింది అరుదు. అతడికి పెద్దగా అవకాశాల్లేవు. ఈ మధ్యే డ్రగ్స్ కేసులో పోలీసుల నోటీసులందుకుని.. విచారణకు కూడా హాజరై వచ్చాడు. దీంతో అతడి పేరు మీడియాలో బాగానే నానింది. మామూలుగా కూడా నవదీప్ తో కొన్ని వివాదాలు ముడిపడి ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే నవదీప్ ను షోకు తీసుకొస్తే మసాలా అద్దినట్లుంటుందని షో నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలిసింది.నవదీప్ రాక తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పెరుగుతుందా లేదా తెలియాలంటే అతడి ఎంట్రీ వరకు వేచిచూడాల్సిందే మరి.నవదీప్ లోనికి వస్తున్న నేపథ్యంలో ఈ వారం  కంటెస్టెంట్ లలోని ఒకరు కాకుండా ఇద్దరు షో నుంచి ఎలిమినేట్ అవుతారని అంటున్నారు.

- Advertisement -