- Advertisement -
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్రా లోకేష్ – నరేశ్ మూడో భార్య రమ్య మధ్య వాగ్వాదం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తామిద్దరం సహజీవనం చేయడంలేదని చెబుతూనే చక్కర్లు కొడుతుండగా తాజాగా మైసూరులోని ఓ హోటల్ కి వెళ్లగా అక్కడికి నరేశ్ మూడో భార్య వచ్చి గొడవ చేసింది.
నరేశ్, పవిత్రా కలిసి వెళ్తుండగా రమ్య పవిత్రా లోకేష్ ని చెప్పుతో కొట్టబోయింది. పోలీసులు రమ్యని అడ్డుకోవడంతో వారిద్దరూ వెళ్లిపోయారు. నరేశ్ రమ్య వైపు చూసి విజిల్స్ వేస్తూ వెళ్లారు.
రమ్య రాకేష్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, వారిద్దరూ కలిసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే నరేశ్, పవిత్ర సంబంధం గురించి మాత్రం ఏం మాట్లాడలేదు.
- Advertisement -