ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలునాటారు హీరో నందు. 3వ విడత గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్ వీతిక శేరు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సైదాబాద్ SBH కాలనీలో మొక్కలు నాటారు నందు.
ఈ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని అందులో భాగంగా నీను కూడ భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
ఈ సందర్భంగా మా సవారీ చిత్రం యూనిట్ బృందం సభ్యులు అయిన హీరోయిన్ ప్రియాంక శర్మ ; దర్శకుడు సాహితి మోత్కూరి; సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర; శ్రీకాంత్; జీవన్ లను మొక్కలు నాటాలని కోరారు.
అదేవిధంగా ప్రజలందరూ కూడా స్వతహాగా ఎవరికివారు మనిషికి ఒక మొక్క అయిన నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్; కాలనీ వాసులు పాల్గోన్నారు.