లిప్‌ లాక్‌తో హీట్ పుట్టిస్తున్న ‘హిప్పీ’ టీజర్..

255
Hippi Movie Teaser
- Advertisement -

‘RX 100’ తో హీరోగా టాలీవుడ్‌లో బిగ్‌ హిట్ అందుకున్న కార్తికేయ తన సెకండ్ ఫిలిం ‘హిప్పి’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తోన్నాడు. కార్తికేయ సరసన దిగాంగన కథానాయికగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను నాచ్యురల్ స్టార్‌ నాని రిలీజ్ చేశారు.

Hippi Movie Teaser

‘ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో దాన్ని పట్టుకున్నారు.. అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు తెలుసా..’అని కమెడియన్ వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్స్ తో హిప్పీ టీజర్ ప్రారంభమవుతుంది. బాక్సర్ గా కార్తికేయ తన ప్రత్యర్థిపై పంచ్ లు విసురుతున్నాడు. టీజర్ చూస్తుంటే కార్తీకేయ ఓ వైపు లవర్ బాయ్ గా లిప్‌ లాక్‌తో, మరోవైపు బాక్సర్ గా అభిమానులకు వినోదాన్ని అందించనున్నాడని తెలుస్తోంది.

- Advertisement -