విషాదం : విజయకాంత్‌ మృతికి కారణం అదే!

19
- Advertisement -

తమిళ హీరో, డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూశారు. కరోనాతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని డీఎండీకే పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా, ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికితోడు తాజాగా కరోనా సోకడంతో ఆయన పరిస్థితి విషమం అయ్యింది. నిజానికి ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాని వల్ల కూడా ఆయన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.

విజయకాంత్ తమిళంలో వందలాది సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే విజయ్ కాంత్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ కాంత్ 1952, ఆగస్ట్ 25న మధురైలో జన్మించారు. తెలుగు, తమిళం సహా పలు భాషాల్లో అనేక చిత్రాల్లో ఆయన నటించారు. రాజకీయాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే పార్టీని స్థాపించిన విజయ్ కాంత్.. 2011-16 వరకు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అనేక రకాల ప్రజా సమస్యలపై తన గళం వినిపించారు. సినిమాల్లో, రాజకీయాల్లో విజయ్‌కాంత్ తనదైన శైలి రాణించారు.

తమిళ సినీ ఇండస్ట్రీలో విజయకాంత్ ఎంతో హుందాగా మెలిగారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ విజయకాంత్ అందించిన సేవలు మరువలేనివి. మా ‘గ్రేట్ తెలంగాణ.కామ్ తరఫున విజయకాంత్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Also Read:అఫ్గాన్ టూర్ లో కెప్టెన్ ఎవరు ?

- Advertisement -