డ్రింకర్ సాయి..సంతోషాన్నిచ్చింది: ధర్మ

3
- Advertisement -

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ మాట్లాడుతూ – ఈ సినిమా గురించి నా ఎక్సిపీరియన్స్ చెప్పాలంటే ముందు డైరెక్టర్ కిరణ్ గురించి చెప్పాలి. తను ఎంతో ప్యాషనేట్ గా కష్టపడి మూవీ చేశాడు. సినిమా అంటే కిరణ్ కు ప్రాణం. కుటుంబం వల్ల డిస్ట్రబ్ కావొద్దని ఆయన భార్యను కూడా ఊరికి పంపించేశాడు. అంత డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. గెస్ట్ లు ఈవెంట్స్ కు రావడం లేదని కిరణ్ బాధపడినప్పుడు ..సినిమాను నమ్మి చేశాం. 27వ తేదీ మ్యాట్నీ నుంచి మన సినిమా మౌత్ టాక్ తో వెళ్తుంది. ఆ తర్వాత సక్సెస్ తో పాటు గెస్టులూ వస్తారని చెప్పాను. నేను సినిమా సూపర్ హిట్ అని రిలీజ్ ముందు ఎప్పుడూ చెప్పలేదు. ఈ సినిమాకు చెబుతున్నా సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్ కు పేరొచ్చింది. ధర్మ, ఐశ్వర్య జోడి బాగుందంటూ రెస్పాన్స్ వస్తోంది. నాకు డ్రింకర్ సాయి క్యారెక్టర్ బాగా నచ్చింది. హై ఎనర్జిలో ఆ క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేస్తుంటుంది. హీరోయిన్ ఐశ్వర్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కథగా చూస్తే “డ్రింకర్ సాయి”లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ నెల 27న థియేటర్స్ లో మా సినిమాను చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాలో నేను బాగీ క్యారెక్టర్ చేయగలను అని నాకంటే ఎక్కువగా నమ్మారు డైరెక్టర్ కిరణ్ గారు. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. అలాగే ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. ధర్మ నా కెరీర్ లో చేసిన మొదటి చిత్రానికి హీరో. అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అలాగే మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ సపోర్ట్ అందించారు. “డ్రింకర్ సాయి” సినిమా ఈ నెల 27న మీ ముందుకు వస్తోంది. సినిమాలోని ఎమోషన్, ఫన్ ను మీరంతా ఫీల్ అవుతారు. అన్నారు.

Also Read:నడకతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

- Advertisement -