- Advertisement -
హీరో గోపిచంద్‌పై ప్రశంసలు గుప్పించారు మెగాస్టార్ చిరంజీవి. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ – రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చిరు… గోపీచంద్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కమర్షియల్ హీరోగా పైకి రావడానికి అన్ని హంగులు ఉన్న వ్యక్తి గోపీచంద్. ఈ పక్కా కమర్షియల్ చిత్రం ద్వారా తను మరింత ఉన్నతస్థాయికి చేరతాడని కొనియాడారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టాలనుకున్నప్పుడు జెండా రూపకల్పనలో దర్శకుడు మారుతి ఎంతో సహకరించాడు… జెండా డిజైనింగ్ వెనుక మారుతి కృషి ఎంతో ఉందన్నారు. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వాడు మారుతి. పక్కా కమర్షియల్ ట్రైలర్ చూస్తేనే అన్ని హంగులు ఉన్న చిత్రం అని అర్థమవుతోంది. కచ్చితంగా ఇది పెద్ద హిట్టవుతుందన్నారు.
- Advertisement -