ఆసుపత్రిలో చేరిన హీరో బాల‌కృష్ణ..

156
- Advertisement -

నందమూరి నటసింహం హీరో బాల‌కృష్ణ కేర్ ఆస్ప‌త్రిలో చేరారు. బాలకృష్ణ గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో గత నెల 31న కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కేర్ వైద్య నిపుణుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. 4 గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.

శస్త్రచికిత్స అనంతరం బాలకృష్ణ కోలుకోవడంతో నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు బాలయ్యకు సూచించారు. కాగా, బాలకృష్ణకు 2018లోనూ కుడిచేతికి రొటేటింగ్ కఫ్ సమస్య రావడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఇక బాలయ్య ప్ర‌స్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుద‌ల తేదీపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది. మ‌రోవైపు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం షో తో బిజీగా ఉన్నాడు.

- Advertisement -