‘గూఢాచారి2’ కి సిద్ద‌మైన అడ‌వి శేష్..

209
adadvi shesh gudachari 2
- Advertisement -

యంగ్ హీరో అడ‌విశేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా గూఢాచారి. ఈమూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఎటువంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఈమూవీ బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షాన్ని కురిపించింద‌ని చెప్పుకోవాలి. ‘క్షణం’ .. ‘గూఢచారిస సినిమాలు విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న ఇదే ట్రాక్ లో మూవీలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఈసినిమా విడుద‌లకు ముందే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఆయ‌న గూఢాచారి సిక్వేల్ కూడా తీయ‌నున్న‌ట్లు చెప్పారు.

Gudachary

తాజాగా వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం అడ‌వి శేష్ గూఢాచారి సీక్వేల్ ను సంబంధించిన ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్నాడ‌ని తెలుస్తుంది. క‌థకు సంబంధించిన ఏర్పాట్లను అడ‌వి శేష్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్న‌ల్లు టాక్. గూఢాచారి బ‌డ్జెట్ కంటే ఎక్కువ బ‌డ్జెట్ తో ఈసినిమాను తెర‌కెక్కించ‌నున్నట్లు స‌మాచారం. 2019సెకండాఫ్ లో ఈ సినిమా షూటింగును ప్రారంభించి, 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా చెబుతున్నారు. గూఢాచారి మూవీని ప్ర‌ముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మించారు.

- Advertisement -