అఖిల్‌ పెళ్లి విషయంలో నాగ్ మౌనానికి కారణం….

225
- Advertisement -

టాలీవుడ్‌లో ఎక్కడికి వెళ్లిన వినిపిస్తున్న మాట అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ పెళ్లి గురించే…. అసలు అఖిల్‌ పెళ్లి ఆగిపోయిందా…. లేక వాయిదా వేసుకున్నారా. పెళ్లి ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదా… కొంత కాలం అఖిల్‌-శ్రియాభూపాల్‌ గ్యాప్‌ మెంటన్‌ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్నలు వీరి పెళ్లి పై ఎదురవుతున్నాయి. అఖిల్‌ పెళ్లి పై క్లారిటీ రావలంటే అక్కినేని నాగార్జున దీనిపై సమాధానం ఇవ్వాలి కానీ ఇప్పటీ వరకు కూడా నాగార్జున ఈవార్తలపై స్పందించను లేదు ఖండిచను లేదు. దీనితో ఈవార్తలు నిజమే అని సినీప్రేక్షకులో మెదులుతున్నమాట.
Here's why Nagarjuna's son Akhil Akkineni and Shriya Bhupal called
కింగ్ అక్కినేని నాగార్జున‌కు త‌న సినిమా కేరీర్‌తో పాటు ఇత‌ర‌త్రా విష‌యాల్లో  ఏ చిన్న విషయం బయటకు పొక్కిన దానికి ప్రెస్‌మీట్‌ పెట్టడం లేదా సోషల్‌మీడియా ద్వారా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వడం చేస్తుంటాడు. అంతేకాకుండా మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే నాగ్ ఏ చిన్న విషయం కూడా దాచడానికి ఇష్టపడడు. అసలు ఒక విషయాన్నికి వస్తే తన పెద్దకుమారుడు నాగచైతన్య సమంతను ప్రేమించిన విష‌యాన్ని మీడియా వాళ్లు ప్ర‌స్తావిస్తే  అవున‌ని ఓపెన్‌గానే చెప్పేశాడు నాగ్‌.

అలాంటి నాగార్జున అఖిల్‌ పెళ్లి విషయంపై క్యాన్సిల్‌ అయినట్లు వార్తలు సోషల్‌మీడియా ప్రకంపనలు రేపుతున్న అస్సలు స్పందించడంలేదు. అంతేకాకుండా అసలు మీడియా కంట కూడా కనపించటం లేదు. అఖిల్‌-శ్రియభూపాల్‌ పెళ్లికి సంబంధించి రోజుకో స్టోరీ బయటకి వస్తుంది. అయిన నాగ్‌ నోరు మెదపడంలేదు.దీంతో ఈ వార్త‌లు నిజ‌మే అని అనుకుంటున్నారు చూసిన వారంతా.
Here's why Nagarjuna's son Akhil Akkineni and Shriya Bhupal called
ఇటీవలే దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా వ‌స్తుంద‌న్న ప్ర‌క‌ట‌న వ‌చ్చినందుకే నాగ్ వెంట‌నే ఖండించాడు. అలాంటిది అఖిల్ – శ్రియా పెళ్లి విష‌యంలో వార్త‌లు బ్యాన‌ర్ క‌థ‌నాలుగా వస్తున్నా..వారం రోజులుగా మీడియాలో ట్రెండ్ అవుతున్నా అస్స‌లు స్ప‌దించ‌డం లేదు.

ప్రస్తుతం నాగార్జున మౌనానికి కారణం అఖిల్‌-శ్రియాలు క‌లుస్తార‌ని న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ట‌. ఇప్పటీకే వీరిద్ద‌రిని క‌లిపేందుకు ఇటు నాగ్‌, అటు జీవీకే ఫ్యామిలీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అవి ఫ‌లిస్తాయ‌నే న‌మ్మ‌కంతో నాగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి నాగ్ న‌మ్మ‌కం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాల్సిందే. ఎప్పుడైతే వాళ్లు కలుస్తారో అప్పడో ఈ వార్తలకు తెర పడే అవకాశం ఉంది.

- Advertisement -