ఛాన్స్‌ ఇస్తే..మళ్లీ బిగ్‌బాస్‌లోకి : హేమ

522
hema big boss 3
- Advertisement -

టైటిల్‌ ఫేవరేట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన హేమ తొలివారంలోనే ఎలిమినేట్ కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన హేమ ఓటింగ్ పద్దతి సరిగా లేకపోవడం వల్లే ఎలిమినేట్ అయ్యానని తెలిపారు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తరువాత నెక్స్ట్ ఎపిసోడ్ ప్రసారం అయిన తరువాతే నన్ను బయటకు పంపారు అని తెలిపారు.

ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎలిమినేట్ చేశారని ఆరోపించారు. బిగ్ బాస్‌లో నటించి ఉంటే ఇంకా ఉండేదాన్నేమో….కానీ అలా చేస్తే జనాలు చెప్పుతో కొడతారని హేమ చెప్పారు. వరైతే తనని బయటకు పంపాలని చూశారో.. ఇప్పుడు వాళ్లు ఎలిమినేషన్‌లో ఉన్నారని తెలిపారు హేమ.

గ్యాస్‌పై వాటర్ పెట్టుకుంటా అని హిమజ అంటే తాను వద్దని చెప్పా… శ్రీముఖి గ్యాస్ అన్ లిమిటెడ్ అని చెప్పింది. ఇప్పుడు సైకిల్ తొక్కితేనే కాని గ్యాస్ రావడం లేదు. నేను పది మందికి పెట్టి వంట చేసే అనుభవం ఉంది కనుక ఎలా ఉండాలో.. ఎలా వండాలో వాళ్లకు చెప్పా. అదే తప్పై పోయిందన్నారు.

బాబా భాస్కర్.. నేను మంచోడుని అని చెప్పుకోవడానికి నటిస్తున్నారు. జాఫర్ నేను జర్నలిస్ట్‌లను అనే భావనలోనే ఉన్నారని తెలిపారు. మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే ఆఫర్ వస్తే తప్పకుండా వెళ్తానని చెప్పారు.

- Advertisement -