బాంబు పేల్చిన బాలీవుడ్ డ్రీమ్ గర్ల్..!

278
hema malini
- Advertisement -

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్,బీజేపీ నాయకురాలు హేమా మాలిని సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ ఎన్నికలే తన చివరి ఎన్నికలని ఇకపై పోటీచేయనని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో యూపీలోని మధుర నియోజకవర్గం నుండి గెలుపొందిన హేమామాలిని ఈ సారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ,అమిత్‌ షాలకు కృతజ్ఞతలు తెలిపారు.

వాస్తవానికి ఈ సారి హేమామాలిని టికెట్ దక్కడం అనుమానమే అని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో మధుర టికెట్‌ను హేమ మాలినికి కేటాయించారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిపై హేమా మాలిని ఘనవిజయం సాధించారు. ఈసారి మాత్రం గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఆమెపై కాంగ్రెస్ నుంచి మహేశ్ పట్నాయక్, ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి నుంచి కున్వార్ నరేంద్ర సింగ్ పోటీ చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి, మోదీ మ్యాజిక్, అమిత్ షా మంత్రాంగం, యోగి ప్రచారం తనను గట్టెక్కిస్తాయని హేమా మాలిని దీమాగా ఉన్నారు.

- Advertisement -