ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో ప్రొడక్షన్ పై మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో అహ్మద్ కబీర్ దర్శకత్వంలో అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న మంచి ఫీల్ గుడ్, లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ ‘హలో జూన్’. ప్రస్తుతం అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 1 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సందర్బంగా
నిర్మాతలు అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి. మాట్లాడుతూ ..”హలో జూన్” మూవీ ఏప్రిల్ 1నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కంప్లీట్లీ ఎమోషనల్, ఫ్రెండ్షిప్, లవ్ బేస్డ్ మీద ఉంటుంది. ఈ సినిమాలో యూత్ కు కావాల్సిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి. ఒక అమ్మాయి జీవితంలో డ్రీమ్స్ ఎలా ఉంటాయో అన్నది ప్రధానంగా సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా వినోదాన్ని పంచుతూనే ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఓ అమ్మాయి జీవితంలో జరిగే టెన్ ఇయర్స్ ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ ట్రావెలింగ్. కాలేజీ జీవితంలో ఆ అమ్మాయి ప్రేమలో ఏలా పడింది. ఈ ఒడిదుడుకుల్లో ఆమె ప్రేమ ప్రయాణంలో ఎలాంటి మజిలీలు చోటుచేసుకున్నాయి.. ఆమె ఫ్రెండ్ షిప్ ఎలా సాగింది.
ఈ నేపథ్యంలో ఆమె తల్లి,తండ్రుల నుంచి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది అనే సన్నివేశాలు ప్రతిఒక్కరినీ కదిలిస్తాయి. ఇందులోని పాటలు పెద్ద మ్యూజికల్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు పెద్ద పెద్ద సింగర్స్ పాడడం జరిగింది. చిత్రమ్మ ,RRR, భీమ్లా నాయక్ ఫెమ్ పృథ్వి చంద్ర,రాధే శ్యామ్ కు పాడిన హరిణి వీరంతా ఈ సినిమాకు పాడారు. ఈ మూవీ లో హీరోయిన్ రాజిష విజయన్ నటన చాలా హైలెట్ గా ఉంటుంది. ఈ అమ్మాయి ఇప్పటికే తమిళంలో కర్ణన్, జైభీమ్ చిత్రాలను చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం మాస్ మహరాజ రవితేజ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ లో కూడా నటిస్తుంది.టెక్నీషియన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు.ఇందులో వచ్చే క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్ మూవీకే హైలెట్ గా నిలుస్తాయి .ఏప్రిల్ 1 న ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న మా ‘హలో జూన్’ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకుంది. మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అన్నారు.
నటీనటులు
రాజిష విజయన్,జోజు జార్జ్ తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ : మోజ్విత్ అండ్ చరణ్ తేజ్
బ్యానర్ : ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో
నిర్మాతలు : అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి
దర్శకుడు : అహ్మద్ కబీర్
కథ: లిబిన్ వర్గీస్, అహ్మద్ కబీర్, లిబిన్ బేబి మాత్యు , డైలాగ్స్ : అనిల్ రెడ్డి.ఎం ,
పాటలు: శ్రీ సిరాగ్,
డి.ఓ.పి : జితిన్ స్టానిష్ లస్,
మ్యూజిక్ : ఇఫ్తీ, ఎడిటర్ : లిజోపౌల్ ,
పి ఆర్.ఓ : అవినాష్ బండి, హరీష్-దినేష్