హలో గురూ ప్రేమకోసమే అంటున్న అఖిల్..!

221
Hello Guru Premakosame for Akhil
- Advertisement -

అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన తొలి సినిమా‘అఖిల్’తో  నిరాశ పరిచాడు. ఫస్ట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా ఓకే చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. తనయుడికి సక్సెస్ ను అందించాలని అక్కినేని నాగార్జున ఈ సినిమా కోసం భారీ పెట్టుబడిని వెచ్చించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ను రంగంలోకి దింపాడు విక్రమ్ కుమార్. ఇరవై రోజుల పాటు మెట్రో స్టేషన్స్, ఫుడ్ గౌడన్స్ లో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికోసం దాదాపుగా రూ.12 కోట్లు ఖర్చుచేశారు.

ఈ సినిమా కోసం ఆసక్తికర టైటిల్‌ని  ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురూ ప్రేమ కోసమే..’పాటను తెలుగు సినీ సంగీత ప్రియులు ఎన్నటికీ మరవలేరు. ఆ సినిమాను ఎంత మంది చూసుంటారో తెలీదు కానీ, ఆ పాటను తరచూ వినడం, హమ్ చేయడం చాలా మంది చేసే పనే. ఇళయరాజా బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా కూడా నిలుస్తుంది ఆ పాట.

నాగ్, అమల పెళ్లికి ముందు వచ్చిన సినిమాలోని ఈ పాట వారి అబ్బాయి సినిమాకు టైటిల్ కాబోతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘హలో గురూ ప్రేమ కోసమే..’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -