హాట్‌ హాట్‌గా ‘హలో గురు ప్రేమకోసమే’ టీజర్..

255
- Advertisement -

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. హీరో హీరోయిన్లపై ఒక రొమాంటిక్ సీన్‌ను టీజర్‌గా కట్ చేశారు.

Hello Guru Prema Kosame

ఇంతకుముందు కంటే రామ్ ఈ సినిమాలో మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా మరింత గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రణీత .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. 39 సెకన్లే ఉన్న ఈ టీజర్ సూపర్ రొమాంటిక్‌గా ఉంది. ఇంకా అలస్యం ఎందుకు మీరూ ఒ లుక్కేయండి..!

- Advertisement -