హలో బేబీ.. పోస్టర్ లాంచ్

20
- Advertisement -

ఎస్ కె ఎల్ ఎమ్ పిక్చర్స్ నిర్మాణంలో హీరోయిన్ కావ్య కీర్తి ప్రధాన పాత్రలో “హలో బేబీ” చిత్రాన్ని నిర్మించారు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ. ఈ చిత్రం పోస్టర్ ను దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ విడుదల చేశారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సొలో క్యారెక్టర్ తో నిర్మించబడ్డ చిత్రం ఈ “హలో బేబీ”. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పోస్టర్ చూడ్డానికి హాలీవుడ్ స్టైల్ లో ఉందని కొత్త స్థానాన్ని ఎప్పుడూ కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మంచి ఫ్యాషన్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఆదినారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు వీర శంకర్.

ప్రొడ్యూసర్ ఆదినారాయణ మాట్లాడుతూ ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఈ మూవీ చేసేటప్పుడు కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో చేసామని, ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ రత్నం అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. హీరోయిన్ కావ్య కీర్తి నటన అద్భుతం అని కొనియాడారు.ఒక అమ్మాయి మొబైల్ హ్యాక్ చేస్తే ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనే కథతో సినిమాని అద్భుతంగా తీశామని అతి త్వరలో సినిమా రిలీజ్ కూడా కాబోతుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి కెమెరామెన్ రమణ.కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి.

Also Read:శ్రుతి హాసన్ పై మరో రూమర్

- Advertisement -