- Advertisement -
ఉత్తరాఖండ్‌లోని గౌరీ కుండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్.. కేదార్‌నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపుతప్పిన హెలికాప్టర్ గౌరీకుండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో పైలట్‌తోపాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
అంతకు ముందే ఆ హెలికాప్టర్ గుప్తకాశి నుంచి కేదార్‌నాథ్ వెళ్లిందని అధికారులు తెలిపారు. తిరిగి గుప్తకాశికి వస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
Also Read:చింతపండుతో లాభమా..నష్టమా?
- Advertisement -

