నితిన్ ‘భీష్మ’లో కుమారి

268
Hebba Patel Nithin
- Advertisement -

కూమారి21ఎఫ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పాటిల్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా ఆ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాలుగైదు చిన్న సినిమాల్లో నటించిన అవి పెద్దగా విజయం సాధించలేదు. దీంతో అమ్మడు తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం హెబ్బాకు తెలుగులో మరో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈమూవీలో రష్మీక మందనను హీరోయిన్ గా ఎంపీక చేయగా..సెకండ్ హీరోయిన్ గా హెబ్బాను ఖరారు చేసినట్లు సమాచారం. ఈసినిమాలో హెబ్బా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట.

ఈమూవీ కోసం హెబ్బా బరువు తగ్గి కాస్త స్లిమ్ గా తయారైందట. త్వరలోనే ఆమె షూటింగ్ లో పాల్గోననున్నట్లు సమాచారం. చాలా రోజుల తర్వాత నితిన్ నటిస్తున్న ఈమూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈచిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.భీష్మ తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ ఓ హీరోయిన్. రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -