నా రేటు అంతే అంటున్న కుమారి….!

279
- Advertisement -

అలా ఎలా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్‌ హెబ్బాపటెల్‌. సుకుమార్‌ నిర్మాతగా వ్యవహరించిన కుమారి21ఎఫ్‌ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది ఈ అందాల భామా. ఈ సినిమా హెబ్బాపటెల్‌ కు మంచి సక్సెస్‌ను ఇచ్చింది. ఈ సినిమాతో హెబ్బాపటెల్‌ కు మంచి ఆఫర్లు కూడా వచ్చాయి దీంతో ఈ అమ్మడు వరుస చాన్సులుతో బిజీగా వుంది.

HEBAH PATEL Raj Tarun Marrige

హెబ్బాపటెల్‌ ఇటీవలే నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ బాక్స్‌ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే దీంతో హెబ్బా తన రెమ్యూనరేషన్‌ ఒక్కసారిగా 60లక్షలకు పెంచిసిందట. తాజాగా హెబ్బాపటెల్‌ ప్రధాన పాత్రలో నటించిన “నాన్న, నేను నాబాయ్‌ఫ్రెండ్స్‌” ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీని తర్వాత చేయబోయే ప్రతి సినిమాకు తన రెమ్యూనరేషన్‌ 60 లక్షలు అని చెప్పిసినట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ప్రస్తుతం హెబ్బాపటెల్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయట వీటికి ఇంకా రెమ్యూనరేషన్‌ నిర్ణయించలేదట. తను నటించిన “నాన్న నేను నాబాయ్‌ ఫ్రెండ్స్‌ “సక్సెస్‌ తర్వాత దీనిపై క్లారిటీ తీసుకుని ఆవకాశం ఉందట.

HEBAH PATEL Raj Tarun Marrige

కుమారి21ఎఫ్‌ లో రాజ్‌తరుణ్‌, హెబ్బాపటెల్‌లు జోడి అందరినీ ఆకట్టుకుంది. ఆతర్వాత ఈడోరకం ఆడోరకం సినిమాలో ఈ జంట మరోసారి కలిసి నటించింది. ఈ రెండు సినిమాల్లో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయట. మరోసారి ఈ జంట” నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ “సినిమాలో కనిపిచనుందట…

ఈ నెల 16కు రిలీజ్కు అవుతున్న ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమాలో గెస్ట్ రోల్లో అలరించనున్నాడు రాజ్ తరుణ్. అశ్విన్, పార్వతీషం, నోయల్లు హేబా బాయ్ ఫ్రెండ్స్గా నటిస్తుండగా, క్లైమాక్స్లో హేబాను పెళ్లిచేసుకునే వరుడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడట. ఈ సినిమాతో ఈ జోడికి మరిన్ని మంచి మార్కులు పడతాయని భావిస్తున్నరట సినీ జనం.

- Advertisement -