బిగ్ హౌస్‌లోకి హెబ్బా పటేల్‌…!

298
hebah
- Advertisement -

బుల్లితెర రియాల్టి షో బిగ్ బాస్‌పై ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ – 1 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య నాని హోస్ట్‌గా ప్రారంభమైన సీజన్‌ 2 చప్పగా సాగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 32 ఎపిసోడ్లు ముగిసిన ఇప్పటికి ఎదో వెలితిగా ఉందని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా బిగ్‌ హౌస్‌కి గ్లామర్ తెచ్చే పనిలో ఉన్నట్లు సమాచారాం. టాలీవుడ్ బ్యూటీ హెబ్బా పటేల్‌ను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్. ఈ వీకెండ్‌లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. షో రోజురోజుకీ ఆసక్తి రేపుతోంది. ఎవరూ ఊహించని విధంగా శ్యామల షో నుంచి ఎలిమినేట్ కావడం ఆమె ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. ఆదివారం నాటి ఎలిమినేట్ ఎపిసోడ్ హౌస్‌లో హీట్ పెంచేసింది.

బిగ్ బాస్‌ ఫస్ట్ పార్ట్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నవదీప్‌ అందరిని ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులకు,నిర్వాహకులు కోరుకున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో సక్సెస్ సాధించాడు. ఈ నేపథ్యంలోనే హెబ్బా ద్వారా హౌస్‌కు మరింత గ్లామర్ తెచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితం ఇస్తుందో వేచి చూడాలి.

- Advertisement -