మేడారంకు పోటెత్తిన భక్తులు..

134
Medaram
- Advertisement -

మేడారం చిన జాతర సందర్బంగా భక్తలు అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా పోటెత్తారు. మహా జాతరకు వచ్చినట్లే చిన్న జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, గద్దెలపై సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరాగా భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఈనెల 27 వరకు మేడారం జాతర జరగనుండగా మొదటిరోజు 60 వేల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు.

- Advertisement -