తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ-మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ సమాచారం.
బుధవారం యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు.. గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఒక్కో చోట అతి నుంచి అత్యంత భారీ వర్షాలు.. కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.20 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
అంతేకాకుండా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా జీహెచ్ఎంసీ పరిధిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలోనూ నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read:కోమటిరెడ్డి ఉండాల్సింది జైలులో!

