తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు..

49

తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీని తెలంగాణలో మూడు రోజుల పాటు వానలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.