MGBS నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది టీజీఎస్ఆర్టీసీ. మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో MGBS ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో బస్సుల రాకపోకలను నిలిపివేశారు.
MGBSకు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. MGBS నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని.. ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రకటన విడుదల చేసింది.
వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు అధికారులు. భారీ వరద కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర.. మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర ప్రవహించింది వరద నీరు. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చింది DRF, రెస్క్యూ సిబ్బంది.
Also Read:Asia Cup: సూపర్ ఓవర్లో భారత్ గెలుపు

