మరో నాలుగు రోజులు భారీ వర్షాలు….

413
heavy rains

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దవుతున్నాయి. హైదరాబాద్ సహా వరంగల్,ఖమ్మం,పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎగువన కురుస్తోన్న వర్షాల ప్రభావంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నిండటంతో గేట్లన్నీ ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో నాలుగు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.

ఆగస్టు 4న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనిజజజ. ఇది తీవ్రంగా మారి పశ్చిమ దిశగా పయనిస్తే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు అధికారులు.