తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం

6
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు, మూడు గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురియగా 21 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 15.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా నల్గొండ జిల్లాలోని శాలిగౌరారంలో 14.15 సెంమీ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో 13.13 సె.మీ వర్షపాతం నమోదు అయింది.

Also Read:కిష్కిందపురి…హారర్ మిస్టరీ

హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. 5 ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది. శేరిలింగంపల్లిలో 13.38 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా గచ్చిబౌలిలో 13.38 సె.మీ,సరూర్ నగర్ లో 12 సెంటీమీటర్లు ,శ్రీనగర్ కాలనీలో 12సెంటీమీటర్లు,ఖైరతాబాద్ సెస్ ప్రాంతంలో 11.88 సె.మీ,యూసఫ్ గూడలో 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు అయింది.

- Advertisement -