మరో మూడు రోజులు భారీ వర్షాలు

393
rains
- Advertisement -

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాగల మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఈరోజు రాత్రి ఒకటి రెండు చోట్ల భారీ వర్షం రావచ్చన్నారు. తెలంగాణతో పాటు కోస్తా ఆంధ్ర మరియు కేరళలోని యానాం లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు, ఎల్లుండి కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే జాలర్లు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -