- Advertisement -
భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దైంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురిసిన వర్షంతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షానికి నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకొని వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ
జలమయమయ్యాయి.
బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఎర్రగడ్డ, మోతీనగర్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, సనత్ నగర్, రాయదుర్గం, గచ్చిబౌలి, అబిడ్స్, నాంపల్లి, కోటి, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్ తదిరత ప్రాంతాల్లో వర్షం కురిసింది.
వర్షం పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. శేరిలింగంపల్లిలో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని బయటకు పంపిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -