పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఇవాళ పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వానలు పడతాయని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
వరంగల్ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. బట్టల బజార్, పాత బీటు బజార్లో రోడ్డుపై వరద నీరు నిలిచింది. హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, రామన్న పేట, శివనగర్, కరీమాబాద్, సాకరాశి కుంటలో కాలనీలు జలమయమయ్యాయి. ఉర్సుగుట్ట సమీపంలో డీకే నగర్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. హబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో పలు వాగులు పొంగిపోర్లుతున్నాయి. పెద్దముప్పారం-దంతాలపల్లి వంతెన పైనుంచి పాలేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read:కోడిగుడ్ల కుంభకోణం..కాంగ్రెస్‌పై RSP ఫైర్

