భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దైంది. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలు నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు.
ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.
పార్సిగుట్టలో వర్షపు నీటిలో గుర్తుతెలియని వ్యక్తి గల్లంతయ్యాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, కొంపల్లి, మాదాపూర్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ భారీ వర్షం కురిసింది.
మలక్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, నాగారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్, ముషీరాబాద్, రామ్‌నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్‌లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. ప్రజలు సమస్యకు సంబంధించి టోల్‌ఫ్రీ 040-21111111, 9000113667కు సంప్రదించాలని అధికారులు తెలిపారు.
Also Read:సీఎం రేవంత్ రెడ్డితో గవర్నర్ దత్తాత్రేయ భేటీ