- Advertisement -
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్సషాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బాన్సువాడ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తోంది సర్వపూర్ వాగు.
మొండి సడక్-సర్వాపూర్ బ్రిడ్జి మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో బాన్సువాడ, కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి.
సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. బిచ్కుంద మండలం శెట్లూరు వాగులో గొర్రెల కాపరులు చిక్కుకోగా జలదిగ్బంధంలో సుమారు 500 గొర్రెలు, ముగ్గురు కాపరులు ఉన్నారు. నల్గొండలో బోరు బావి నుంచి పైకి ఉబికి వస్తోంది నీరు.
Also Read:జలదిగ్బంధంలో వనదుర్గా భవానీ ఆలయం
- Advertisement -

