రాష్ట్రానికి భారీ వర్ష సూచన..

231
- Advertisement -

తెలంగాణలో మంగళ, బుధవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నిన్నటినుండే నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం కురిసింది. నల్లగొండ పట్టణంతోపాటు మరికొన్ని మండలాల్లో వర్షం కురిసింది.

నిజామాబాద్ మండలంలో అత్యధికంగా 4.34 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, తిరుమలగిరి, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, మియాపూర్, కొండాపూర్, కృష్ణానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, నారాయణగూడ, అంబర్‌పేట, కాచిగూడ, చార్మినార్, అసిఫ్‌నగర్, గోల్కొండ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

- Advertisement -