రాగల 36 గంటలు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ఇక ముఖ్యంగా రానున్న 24 గంటల్లో మాత్రం ఉత్తర తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాయలసీమలో 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈశాన్య మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిన తరువాతే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది.
ఉత్తర భారతదేశంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడూ తెరిపి ఇస్తూ, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు, కచ్, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాలు, చండీగఢ్, ఉత్తర పంజాబ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు,ఉత్తర ప్రదేశ్,జమ్మూ కశ్మీర్‌లకు రుతుపవనాలు చేరుకున్నాయని వెల్లడించింది.