బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

1
- Advertisement -

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణలో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది. భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది.

ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో చూస్తే ఇవాళ్టి నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది.

Also Read:అల్సర్ ఉందా.. అల్లంతో జాగ్రత్త!

- Advertisement -