రాష్ట్రానికి భారీ వర్ష సూచన..

7
- Advertisement -

ఇవాళ, రేపు రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. లంగాణలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది.

హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఏపీలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

Also Read:జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు: సీఎం రేవంత్

- Advertisement -