అలర్ట్..తెలంగాణకు భారీ వర్షసూచన..

3
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సూర్యపేటలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఎల్లుండి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని, తిరిగి వారం రోజుల తర్వాత మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పెరుగుతాయని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ సీజన్లో 38 శాతం మీద అధిక వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read:ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం

- Advertisement -