23 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు..!

14
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో 23వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.త‌మిళ‌నాడులోని ఉత్త‌ర ప్రాంతాల వ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం విస్త‌రించింది. ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు ఏపీ, తెలంగాణ‌లో మోస్త‌రు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే సూచ‌న‌లు ఉన్నాయి. అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవ‌కాశం ఉంది. కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ మీదుగా శ్రీలంక వ‌రకు ఉప‌రిత‌ల ద్రోణి ఆవ‌రించింది. స‌ముద్ర‌మ‌ట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉప‌రిత‌ల ద్రోణి కొన‌సాగుతోంది. రేప‌టికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాల‌పై నైరుతీ రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

Also Read:ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా?

- Advertisement -