ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. ఇంకా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మరింత వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆది, సోమ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కొన్ని రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లుతాయని తెలిపింది. ఈ నెల18న ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో మళ్లీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇది తుఫాన్‌గా మారుతుందా? లేదా అనేది రానున్న రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.
వర్షాలతో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, ..బేగంపేట్,యూసఫ్ గూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.