5 రోజుల పాటు భారీ వర్షాలు..

14
- Advertisement -

రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురస్తాయని పేర్కొంది.

కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని…పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది.18 నుంచి 20 వరకు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని వివరించింది.

రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని తెలిపింది.

Also Read:కాంగ్రెస్‌ పాలనపై రైతుల కన్నెర్ర..

- Advertisement -