- Advertisement -
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు పడుతాయని వెల్లడించింది. ఆ తర్వాత ఒకట్రెండు రోజులు పొడి వాతావరణం ఏర్పడి, తిరిగి వానలు కురిసే వీలున్నదని పేర్కొన్నది. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1న మరో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
- Advertisement -