తెలుగు రాష్ట్రాలు..భారీ వర్షసూచన

2
- Advertisement -

రెయిన్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ.

మరోవైపు తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయగా తేని, తిరునల్వేలి సహా ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. భారీ వర్షాలకు నీలగిరిలో కొండచరియలు, వృక్షాలు నేలకొరిగాయి. రెండు రోజులపాటు పర్యాటక స్థలాలు మూసివేశారు.

Also Read:GIC:హరితసేనలో నటి మధుమిత

- Advertisement -