తెలంగాణలో భారీ వర్షాలు..

6
- Advertisement -

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఇక నిన్న సాయంత్రం నుండి హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతం కాగా వర్షాలు కురుస్తున్నాయి.

Also Read:మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్

- Advertisement -