భారీ వర్షాలు..432 రైళ్లు రద్దు

12
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం కాగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తుండగా జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నారు.

భారీ వర్షం కారణంగా 432 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరో 139  రైళ్లను దారి మళ్లించింది. 13 రైళ్లు పాక్షికంగా రద్దు చేసింది. రద్దైన రైళ్లలో సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌లు ఉండగా ప్రయాణికులు గమనించాలని కోరింది.

కాజీపేట-డోర్నకల్-కాజీపేట, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్‌, విజయవాడ-గుంటూరు-విజయవాడ రైళ్లను రద్దు చేయగా, ఢిల్లీ-సెంట్రల్ చెన్నై, దానాపూర్-బెంగళూరు రైళ్లను దారి మళ్లించారు.

Also Read:సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి ఫోన్

- Advertisement -