తెలంగాణలో భారీ వర్షాలు..

490
monsoon
- Advertisement -

మరో 24గంటల్లో తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు ఏపీలోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సమాచారం. మరోవైపు, అరేబియా సముద్రంలో రెండు తుపాన్లు కొనసాగుతుండగా, సూపర్ సైక్లోన్‌గా మారిన ‘క్యార్‌’ బలహీనపడి పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో తుపానుగా కొనసాగుతోంది. తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా గాలులు వీస్తాయని.. ఆ కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.

ఈ తుఫాను శుక్రవారం మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘మహా’ తుపాను నిన్న సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలహీనపడి, రాత్రికి లక్షదీవుల వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో బుధ,గురువారాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో 10సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు కేరళ,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కేరళ,ఎర్నాకుళం, త్రిసూర్,మలప్పురం,కోజికోడ్ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Cyclone

- Advertisement -