గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

93
rains
- Advertisement -

నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. వాతావరణం చల్లబడగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.కొంపల్లి, సుచిత్ర, చింతల్, జగద్గిరి గుట్ట, బాలానగర్, సూరారం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గండిమైసమ్మ, గాజులరామారం, షాపూర్ నగర్, కుషాయిగూడలో భారీ వర్షం కురిసింది.

చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడెంలో భారీ వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో ఈదరుగాలులు వీయడం, వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలు చోట్ల రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -