రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఇక ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు.
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్‌ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
Also Read:YSR:హ్యాపీ బర్త్ డే..రాజన్న